Annamayya, Annamacharya, Annamayya Keerthanalu, Annamacharya Keerthanalu
|
Annamayya, Annamacharya www.annamayya.in నమో నారాయణాయ నీ నామమే మాకు నిధియూ నిధానము నీ నామమే ఆత్మనిధానాంజనము కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని నామమును, సంకీర్తనలను తీరని ధనముగా భావించాడు మన అన్నమయ్య. 1408 విరొధి నామ సంవత్సరము వైశాఖ శుధ్ద పూర్ణిమ,విశాఖ నక్షత్రమున నారాయణ సూరి లక్క మాంబ లకు జన్మించిన అన్నమయ్య తన 95 సంలజీవితకాలములొ 32,000 సంకీర్త నలతొ శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మహాత్యాన్ని, తత్వాన్ని కీర్తించారు. అన్నమయ్య పుట్టుకతొ స్మార్త భ్రాహ్మణ శాఖకు చెందిన అద్వైతియయినను తాను వలచి స్వీకరించినది శ్రీవైష్ణవ సిద్తాంతమగు విశిష్టాద్వైతమే. అన్నమయ్య సంకీర్తనలలొ భగవత్ భక్తి, సాహిత్యము,సంగీతము, త్రివేణి సంగమముల మేళవించాయి. అన్నమయ్య సంకీర్తనలు మహా మహిమాన్వితాలు, ఈ మహిమలతొ ఈప్సితా ర్తము నెరవేర్చుకొనవచ్చును. భక్తి ప్రపత్తి, దేహత్మేశ విచారాదులను తెలిపే ఆధ్యాత్మిక సంకీర్తనలు, జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని చాటే అమలిన దివ్య శృoగార సంకీర్తనలు. సంకీర్తన లక్షణ గ్రంధం, శృoగార మంజరి, ద్విపద రామాయణము, వేంకటాచల మహత్యము వేంకటేశ్వర శతకము అన్నమయ్య రచనలు. సకల వేదాలకు ఆలవాలము ఈ సంకీర్తనలు,పదాలతొ పరమపదానికి సొపానము ఈ హరి కీర్తనలు. మనసులొ ఆ స్వామి దివ్యమంగళ రూపమును ఊహిస్తూ ఏలాంటి ఆలొచనలు రాకుండా అన్నమయ్య కిర్తనలను మనసుతొ పాడుతూ వుంటే కలిగే అనుభూతి మాటలతొ చెప్పలేము. మనసులొ కలిగిన చిన్న అలొచనకు ఆ స్వామి అపార కరుణతొ చిన్న ప్రయత్నం కాస్త మహాయజ్న ముగా మారి 14800 సంకీర్తనలతొ website గా మారింది. ఇందులొని అక్షర తప్పులకు నేనే బాద్యత వహిస్తూ మీ రిచ్చే సలహలను, అభ్యంతరాలను తేలియచేయండి.అ స్వామి పాదాలను అర్చించడం తప్ప ఏలాంటి ప్రతి ఫలాన్నిఅశించడము లేదు. భగవత్ భందువులు మీరు ఈ అమృత గుళికలను చదివి, విని,పాడి తరించండి, పది మందికి పంచి తరింప చేయండి. ఒక్క సంకీర్తనే చాలు ఓద్దికై మమ్ము రక్షింపగా తక్కినవి భండారాన దాచివుండనీ. వెక్కసమగు నీ నామము వెల సులభము ఫల మదికము దికైనన్నేలితివి యిక అవి తీరని నాధనమయ్యా. www.annamayya.in |
